క్రీడలతో మానసిక ఉల్లాసం
ఘనంగా ముగిసిన విఆర్ఎస్ యూత్ నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు
విజేతలకు బహుమతి ప్రధానం చేసిన కుందూరు జైవీర్ రెడ్డి
నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి :
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని వడ్డెర రాజుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

హోరాహోరీగా సాగిన ఈ క్రీడా పోటీలలో పివిఆర్ జట్టు, ఫ్రెండ్స్ ఫరెవర్ జట్టు ఫైనల్ మ్యాచ్ కు అర్హత సాధించి ఫైనల్ మ్యాచ్ ఆడగా హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి విన్నర్ గా నిలిచిన పివిఆర్ జట్టు 100000 రూపాయల నగదు బహుమతిని, క్రీడా ట్రోఫీని అందుకోగా, రన్నర్ గా నిలిచిన ఫ్రెండ్స్ ఫరెవర్ జట్టు 50000 రూపాయల నగదు బహుమతిని, క్రీడా ట్రోఫీని అందుకున్నాయి. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంచుతాయని, యువత ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. మొదటి బహుమతి 100000 రూపాయలు పోచమ్మ గుడి ఆలయ చైర్మన్ దేవర్ల సైదేశ్వర రావు, రెండవ బహుమతి 50000 రూపాయలు పోచమ్మ గుడి ఉపాధ్యక్షులు ఈర్ల భానుచందర్, టోర్నమెంట్ నిర్వహణ నిమిత్తం 50000 రూపాయలు బత్తుల వెంకటేశ్వర్లు (కాంట్రాక్టర్) అందించారు. ఈ క్రీడా పోటీలకు ఆర్గనైజర్లుగా గోపాల్, ఈర్ల శేఖర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, రాజా ప్రసాద్ (వైన్స్), మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, బత్తుల సతీష్ (కాంట్రాక్టర్) , ఈర్ల రాంబాబు, జంగయ్య, ఆదాసు విక్రమ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వడ్డెర రాజుల సంఘం సభ్యులు, స్థానిక క్రీడా అభిమానులు పాల్గొన్నారు.