ప్రజాహితమే ప్రథమ లక్ష్యం కావాలి
నందికొండ మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రజలకు
విజ్ఞప్తి చేసిన సమాచార హక్కు–మానవ హక్కు లా సమితి సభ్యులు
నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి :
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థులు ప్రజాహితాన్ని తమ ప్రధాన అజెండాగా పెట్టుకోవాలని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకునే మున్సిపాలిటీ ప్రజలకు సమాచార హక్కు–మానవ హక్కు లా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, స్వలాభం కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలు, సంక్షేమాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, సౌలభ్యాలు, ప్రజా రక్షణ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే అభ్యర్థులకే ఓటు వేయాలని వారు ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి అభ్యర్థి రోజువారీ దినచర్యలో భాగంగా కనీసం రోజుకు 12 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యలు విని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజల ముందే ప్రమాణం చేయాలని కోరారు. అలాగే మున్సిపాలిటీలో తీవ్ర తరంగా మారుతున్న కోతులు, వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించే దిశగా స్పష్టమైన ప్రణాళికలు, అమలు చేయగల సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.ప్రజల భద్రత, పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతమే ఎన్నికల అసలైన ప్రమాణాలని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపగలిగే, బాధ్యతాయుత పాలన అందించే అభ్యర్థులను ప్రజలు గుర్తించి ఆశీర్వదించాలని వారు కోరారు. సమాచార హక్కు మానవ హక్కు- లా – సమితి సభ్యులు నందికొండ మున్సిపాలిటీ వద్ద ఏర్పాటుచేసిన బ్యానర్లు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.