హనుమకొండ, అక్షిత ప్రతినిధి: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి( డిఆర్వో )గా విధులు నిర్వర్తిస్తున్న వై.వి. గణేష్ కు ఐఏఎస్ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్ బుధవారం పలువురు తెలంగాణ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ గెజిట్ వెలువరించింది.ఐఏఎస్ పదోన్నతి పొందిన వై వి గణేష్ ను పలువురు అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.