సాగర్ ఎడమ కాలువలో దూసుకుపోయిన కారు దంపతులు మృతి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మృత్యువు నుంచి ఒకసారి తప్పించుకున్నారు కానీ రెండోసారి తప్పించుకోలేకపోయారు. విషాద ఘటన నిడమనూరు మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. త్రిపురారం మండలం కంపసారం గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు శనివారం రాత్రి కారులో స్వగ్రామానికి వెళుతుండగా కారు అదుపుతప్పి ఎడమ కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు.
నిడమనూరు మండలం మండలం కంప సాగర్ గ్రామానికి చెందిన దంపతులు గత నెల లో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వెంకటాద్రిపాలెం గ్రామం రోడ్డుపై మంచు కురుస్తున్న సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్యాభర్తలకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయి శనివారం స్వగ్రామానికి సాయంత్రం తిరుగు ప్రయాణమై కారులో బయలుదేరి వెళుతుండగా ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ లో అదుపుతప్పి దూసుకుపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ బయటపడినట్లు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలిసింది కంపసాగర్ గ్రామం రోదనలతో వెల్లువెత్తుతుంది. మిర్యాలగూడలో కూడా వీరికి సంబంధించిన బంధువులు ఆప్తులు ఉండటంతో వారి బాధ వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఉంది. మృతులు తల్లం పుల్లయ్య, పద్మలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.

ఒక కుమారుడు మిర్యాలగూడలోనే ఉంటూ మరో కుమారుడు అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. ఆర్యవైశ్యుల్లో ఆదర్శ దంపతులైన వీరి మరణం తీరని లోటని వీరి మరణం ఆర్యవైశ్యుల అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి మిర్యాలగూడ డి ఎస్పీ కె. రాజశేఖర్ రాజు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.