*ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి
ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్
నల్గొండ, అక్షిత టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న నల్లగొండలోని ఐఎంఏ హాల్లో ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు కోరారు. శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాంపుకు సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ వారి రేనోవా సెంచరీ హాస్పిటల్, ఐఎంఏ నీలగిరి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని నల్లగొండ తోపాటు చుట్టుపట్టు గ్రామాల మహిళలు ఈ క్యాంపులో పాల్గొని ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నేటి సమాజంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారని వారి ఆరోగ్యాలను పరిరక్షించేందుకు ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ క్యాంపులో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మమ్మె గ్రామ్, ధర్మోగ్రామ్ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పాప్ స్మియర్ చేయబడునని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రేనోవా సెంచరీ హాస్పిటల్ ప్రఖ్యాత వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రపుల్ కుమార్, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కె విజయ్ కుమార్ ట్రెజరర్ డాక్టర్ గాజుల ప్రవీణ్, డాక్టర్ అనిత రాణి తదితరులు ఉన్నారు.