అపరిష్కృత సమస్యలకు చెక్ 

అపరిష్కృత సమస్యలకు చెక్ 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

ఎమ్మెల్యే బిఎల్ఆర్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో నెలకొని ఉన్న అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక సమావేశంలో పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్ పందిరి అనిత మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన మురుగు కాల్వల్లో పేరుకుపోయినదని దోమలు పెరిగి పోతున్నాయని మురుగు తొలగించే కార్యక్రమం చేపట్టాలని కోరారు.

వార్డుల్లో చెత్త ఎత్త కుండా ఒక చోట వేస్తున్నారన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది సక్రమంగా పని చేయడం లేదన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని మారుస్తుండాలని బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి. ఇలియాస్, పెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే
బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలని కోరారు. ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయని 29వార్డు కౌన్సిలర్ జావీద్ చె కమీషనర్ శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్, కౌన్సిలర్లను సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, కౌన్సిలర్లు మలగం రమేష్, నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, ఫారుక్ మొహమ్మద్, ఎండి.హమీదుద్దీన్ మొయిజ్, బూడిద సైదులు, సలీం, నిషిత్ యాదవ్, మలగం రమేష్, ఆరిఫా అబ్దుల్లా, షబానా బేగం అయూబ్, షేక్ సాహేరా బేగం, పెద్ది శ్రీనివాస్ గౌడ్, శ్రీజ, బిక్షం, డిఇఇ వెంకన్న, మేనేజర్, ఆర్ఓ జి.జ్ఞానేశ్వరి, టీపిఎస్ అంజయ్య,టీపీబిఒ చరణ్, ఎఇ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, పర్యావరణ ఇంజనీర్ శ్వేత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking