నందికొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

నందికొండలో ప్రజాపాలన
ప్రగతి ప్రణాళిక

ప్రభుత్వ ప్రతిష్టాత్మక

కార్యాచరణకు
కౌన్సిలర్ల గైర్హాజర్

నాగార్జునసాగర్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 6 నుండి మార్చి 12 వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పారిశుద్ధ్యన్ని పెంపొందించడం పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తో స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడం పారిశుద్ధ్యన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.

అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటిరోజు ప్రజా పాలన కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ , నలుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరవటం గమనార్హం. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ లు, మునిసిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking