పాడైన పాత బోరింగుల తొలగింపు కొత్త బోరింగుల ఏర్పాటు
మామిడిపల్లిలో త్రాగునీతి సమస్యకు పరిష్కారం
వేసవిలో భూగర్భ జలాల తగ్గుదలతో నీటి ఎద్దడికి చెక్
కొద్దిపాటి నీటితోనే సమర్థవంతంగా వినియోగించుకునే చర్యలు
ప్రజలకు త్రాగునీరు అందించడం మా ప్రధాన కర్తవ్యం
మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అంబటి శ్రీనివాస్
నాగారం అక్షిత న్యూస్ :
మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టడం జరిగింది. నాలుగు సంవత్సరాల క్రితం చెడిపోయి పాడుబడిన చేతి బోరింగ్ లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో కొత్త బోరింగ్ లను అమర్చి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. వేసవికాలంలో మండే ఎండల కారణంగా భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోవడంతో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది. దీనివల్ల బోరు మోటార్లకు సరిపడా నీరు అందకపోవడం సమస్యగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అదే ప్రదేశాలలో చేతిపంపులు మరియు బోరు పంపులను ఏర్పాటు చేసి బోరులో లభ్యమయ్యే కొద్దిపాటి నీటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు త్రాగునీరు అందించడం మా గ్రామపంచాయతీ ప్రధమ కర్తవ్యం అని, వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న, అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్ధవంతంగా వినియోగించుకునేలా ఈ చర్యలు చేపట్టామని అన్నారు. బోరు బావులు ఎండిపోవడం వంటి సమస్యలు వచ్చినప్పటికీ చేతి పంపులు ఏర్పాటు చేయడం ద్వారా కనీస అవసరాలకు సరిపడా నీటిని పొందేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామంలో నీటి సమస్య పూర్తిగా నివారించేందుకు మరిన్ని శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్, గ్రామ ఉపసర్పంచ్ గుండెబోయిన సతీష్, వార్డ్ మెంబర్ పేరాల ఈశ్వర్, ఇరుగు శిరీష సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.