లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 350 మందికి ఉచిత భోజనం
ఆకలి లేని సమాజం’ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు
నారాయణపేట,అక్షిత బ్యూరో:
లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వీల్స్‌పై ఉచిత భోజనం’ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం సత్యనారాయణ కమాన్, నారాయణపేటలో 350 మందికి ఉచితంగా భోజనం అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2026–27 సంవత్సరంలో 40 రోజులుగా ఉచిత భోజనాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈరోజు నిర్వహించిన ఉచిత భోజన కార్యక్రమానికి శ్రీ రాజేందర్ సహకారం అందించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ రవికుమార్ గౌడ్ సూచనలు, పర్యవేక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో లయన్ రవికుమార్ గౌడ్, లయన్ మోహన్ కుమార్ కోన, లయన్ రాజేష్ పోలేపల్లి, లయన్ శ్రీనివాస్ లహోటి, లయన్ కృష్ణమూర్తి, లయన్ కన్న జగదీష్, లయన్ సందానంద్ చారి, లయన్ ఎస్. చక్రవర్తి పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం గొప్ప మానవతా సేవ అని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాత రాజేందర్‌కు లయన్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320ఏ అధ్యక్షుడు లయన్ రవికుమార్ గౌడ్, కార్యదర్శి లయన్ మోహన్ కుమార్ కోన,కోశాధికారి లయన్ రాజేష్ పోలేపల్లి,కన్న జగదీశ్, అంబికా బాలు తదితరులు పాల్గొన్నారు.