ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు 

ఆదివాసులతో కలిసి నృత్యం చేసిన కలెక్టర్, ఎస్పీ

ఇచ్చోడ అక్షిత న్యూస్ :

ఆదివాసిల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసు కుంటుందని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. అదిలాబాద్ బస్టాండ్ వద్ద కొమరం భీం విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసి సాంప్రదాయ డోలు, డెంసా, తుడుం వాయి ద్యం చప్పుళ్ళు, రేలారే రేలారే రేలా పాటల మధ్య ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేస్తూ కలెక్టర్, ఎస్పీ ఆకట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking