జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాటమే స్ఫూర్తి

జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాటమే స్ఫూర్తి!

కొమరం భీమ్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తాం

లోకేశ్వరంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు…

లోకేశ్వరం, ఆగస్టు 9 (అక్షిత న్యూస్ ):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకేశ్వరం మండల కేంద్రంలోని కొమరం భీమ్‌ చౌరస్తాలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, గ్రామ ప్రజలు, ఆదివాసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆదివాసీల హక్కుల కోసం జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదంతో పోరాడిన అమరవీరుడు కొమరం భీమ్‌ను స్మరించుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కొమరం భీమ్‌ చేసిన త్యాగాలను, ఆదివాసీల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాన్ని కొనియాడారు.

హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాలి

ఈ సందర్భంగా లోకేశ్వరం గ్రామ ఆదివాసీ నాయక పోడ్‌ అధ్యక్షుడు బండారి సాయన్న మాట్లాడుతూ.. కొమరం భీమ్‌ చూపిన మార్గంలో నడుస్తూ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల సంక్షేమం, విద్య, ఉపాధి, అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో బండారి సాయన్న, నీలగిరి గంగాధర్, అలోళ్ల మురళి, మెట్టు నరేష్,గోనేటి భోజన,గోనేటి రాందాస్,బండారి గంగాధర్,బండారి దాసు,బండారి సాయి తేజ,సాకి లక్ష్మణ్,గోనేటి జగదీష్,తో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలు,యువకులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking