ఏళ్ల చీకటికి.. ఎమ్మెల్యే చొరవతో వెలుగులు!

ఏళ్ల చీకటికి.. ఎమ్మెల్యే చొరవతో వెలుగులు!

గంగామాత ఆలయానికి విద్యుత్‌ సరఫరా…

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు గంగపుత్రుల ఘన సన్మానం…

లోకేశ్వరం, ఆగస్టు 9, అక్షిత న్యూస్‌: 

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్‌ గ్రామంలో గంగామాత ఆలయానికి ఎన్నో ఏళ్లుగా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.గంగపుత్ర సంఘం ప్రతినిధులు సమస్యను ముధోల్ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ దృష్టికి తీసుకెళ్లగా..ఆయన చొరవతో ఆలయానికి విద్యుత్‌ సరఫరా కల్పించారు.ఏళ్లుగా ఆలయానికి విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌,కు గంగపుత్ర సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భైంసా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. గంగామాత ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయానికి ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.దీంతో ఆలయానికి మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని గంగపుత్ర సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భైంసా మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌బాబు, నాయకులు గంగారెడ్డి,పృథ్వీ పటేల్‌, వెంగల్‌రావు,తో పాటు గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking