మల్యాల శివాలయం వీధిలో పీడీఎస్ బియ్యం లభ్యం.

మల్యాల శివాలయం వీధిలో పీడీఎస్ బియ్యం లభ్యం.

 అధికారుల నిర్లక్ష్యంపై మాజీ ఎంపీటీసీ రమేష్ ఆగ్రహం.

మల్యాల అక్షిత ప్రతినిధి :

మండల కేంద్రంలోని శివాలయం వీధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ కు చెందిన సన్నబియ్యాన్ని దళారులు విక్రయించి, రోడ్డుపై వదిలేసి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. పేదలకు చేరాల్సిన బియ్యం ఈ విధంగా రోడ్డుపాలు కావడం పట్ల మల్యాల మాజీ ఎంపీటీసీ రాచర్ల రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాచర్ల రమేష్ మాట్లాడుతూ… రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఉన్న సన్నబియ్యాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ, విక్రయాలకు పాల్పడుతున్న దళారులతో పాటు వారికి సహకరిస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking