శ్రీ జయ దుర్గా మైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల పండుగ జాతర..                 

శ్రీ జయ దుర్గా మైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల పండుగ జాతర..                 

పాల్గొన్న పీఏసీ చైర్మన్ గాంధీ వారిసతీమణి శ్యామలాదేవి.. 

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..

శ్రీ జయ దుర్గా మైసమ్మ దేవాలయం, హైదర్ నగర్ లో ఈరోజు,ఆదివారం బోనాల పండుగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.ఈ ఏడాది బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి విశేష అలంకరణ,మండపం లో వృత్తాకారంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ, వివిధ రకాల పుష్పా లతో రూపొందించిన అమ్మవారి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పుష్పా లతో సుందరంగా తీర్చిదిద్దిన అమ్మవారి ప్రతిమ భక్తులను విశేషంగా ఆక ట్టుకుంది.ఈ సందర్భంగా శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరెకపూడి గాంధీ, వారి సతీమణితో కలిసి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కూడా దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.బోనాల పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. శ్రీయుత కమిషనర్, దేవాదాయ శాఖ ఆదేశాలు అనుసరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ఆలయ అధికారులు,అర్చకులు, సిబ్బంది, బాజా భజంత్రీలు, సేవకులు, పోలీస్, జిహెచ్ఎంసి, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృతజ్ఞతాభివందనం  శ్రీ జయ దుర్గా మైసమ్మ దేవాలయంలో ఆదివారం రోజు నిర్వహించిన బోనాల పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర కార్య క్రమానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు అని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking