కొత్త రాజోలి లోనే ఎమ్మార్వో ఆఫీస్ ను నిర్మించాలి.
ఎంపీడీకే అరుణకు వినతి పత్రం సమర్పించిన.
రాజోలి అఖిలపక్ష కమిటీ నాయకులు.
రాజోలి/ అక్షిత న్యూస్.
జోగులాంబ గద్వాల జిల్లా కొత్త రాజోలిలో ఎమ్మార్వో ఆఫీస్ ను నిర్మించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ కార్యాలయంలోఎంపీ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణని కలిసి వినతి పత్రం అందజేసిన కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ నాయకులు.వివరాలలోకి వెళ్తే…కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ నాయకులు ఎంపీ డీకే అరుణని మర్యాదపూర్వకంగా కలిసి రూ 2.25 కోట్లతో శాంక్షన్ చేసిన ఎమ్మార్వో భవనాన్ని వరద ముంపు లేని కొత్త రాజోలి గ్రామంలోనే నిర్మించాలని సమస్యను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ విషయంపై ఎంపీ అరుణ స్పందిస్తూ 2009 సంవత్సరంలో వచ్చిన వరదలకు పాత రాజోలి గ్రామం మునిగిపోయిన విషయం నాకు బాగా తెలుసనీ ముంపు జరిగిన తర్వాత ఎన్నోసార్లు రాజోలి గ్రామానికి వచ్చి ప్రజల సాధకబాధలు స్వయంగా విన్నాననీ ఆమె అఖిలపక్ష నాయకులకు తెలియజేశారు.ప్రతి ఒక్కరికి ఇండ్లు మరియు ఫ్లాట్లు వచ్చే విధంగా నా వంతు కృషి చేశాను. అలాగేఅప్పట్లోప్రభుత్వ భవనాల కొరకు కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ వరద ముంపు ప్రాంతమైన పాత రాజోలి గ్రామ ప్రాంతంలో ఎలా ఎమ్మార్వో కార్యాలయాన్నిఎలా కడతారనీ ఆమె ప్రశ్నించారు. ఏ భవనమైనా సరే కొత్త రాజోలిలోనే నిర్మించే విధంగా నా పూర్తి సహాయం ఉంటుందని ఎమ్మార్వో భవనం విషయంలో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, భవిష్యత్తులో వరద ముప్పు లేని ప్రాంతమైన కొత్త రాజోలి గ్రామంలోనే నిర్మించే విధంగా నా వంతు కృషిగా గట్టిగా ప్రయత్నం చేస్తానని అఖిలపక్ష నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.