పయనం ప్రాణ సంకటం

పయనం ప్రాణ సంకటం

గుంతల మయంగా తెట్టకుంట రోడ్డు

దామరచర్ల, అక్షిత న్యూస్ :

ఈ దారి గుండా పయనం… ప్రాణ సంకటంగా పరిణమించింది. రోడ్డంతా గుంతల మయంగా మారింది. పదేళ్లుగా ఈ రోడ్డు మరమ్మత్తులకు నోచుకోలేదు. వివరాల్లోకి వెళితే… దామరచర్ల మండలంలోని నునావత్ తండా నుంచి తెట్టకుంట రహదారి వాహనదారులకు ప్రాణ సంకటంగా పరిణమించింది. ప్రజా రవాణా సౌకర్యాలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో లేకున్నా గాని ఈ దారిలో ప్రతి రోజు ఆటోలు, బైకుల పైన నిత్యం బ్రతుకు తెరువు కోసం.. పిల్లలు స్కూళ్లకు ఈ రోడ్డు మార్గం గుండా దగ్గరలోని మిర్యాలగూడ పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి వేళల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే చాలా మంది ప్రజలు ఈ గుంతల రోడ్ల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని నునావత్ తండాకు చెందిన
డి. బాలు నాయక్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking