గేర్జం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

గేర్జం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

– బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ..

– కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి 50 మంది యువకులు, మహిళలు

ఇచ్చోడ, అక్షిత న్యూస్:

గేర్జం గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గేర్జం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ యువకులు

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది యువకులు, పలువురు మహిళలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌పై నమ్మకంతో యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ మనోహర్, మాజీ ఉప సర్పంచ్ బలగం రవి, నాయకులు సిద్ధవార్ వెంకటమంటేష్, గాద్గే సుభాష్, ముండే పాండురంగ్, నిర్వాడే రమేష్, సాబేర్, గోవర్ధన్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking