సేవా జ్యోతి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి
– యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి
– బీజవైఎం ఐటీ సెల్ జిల్లా ఇంచార్జ్ ,సేవ జ్యోతి కార్యక్రమ మండల ఇంచార్జి ఇన్‌చార్జి మచ్చ వివాకర్
మూటకొండూర్ అక్షిత ప్రతినిధి:
భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అక్టోబర్ 7న నిర్వహించనున్న సేవా జ్యోతి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజవైఎం ఐటీ సెల్ జిల్లా ఇంచార్జ్ ,సేవ జ్యోతి కార్యక్రమ మండల ఇంచార్జి, మచ్చ వివాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మూటకొండూర్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మండల ఇన్‌చార్జి మచ్చ వివాకర్ అధ్యక్షతన ర్యాలీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవ, సమర్పణతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అందులో భాగంగా అక్టోబర్ 7న జరిగే సేవా జ్యోతి బైక్ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చిర్ర రవీందర్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్గ అశోక్, గౌరవ వార్డు సభ్యులు రేగు మల్లేష్, ఆలేటి నాగరాజు, సీనియర్ నాయకులు బాల నరసింహులు, శనిగరం ప్రదీప్, భూమండ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.