గ్రామ భద్రతకు సర్పంచ్ శ్రీలత సుందర్ ప్రత్యేక చొరవ!

గ్రామ భద్రతకు సర్పంచ్ శ్రీలత సుందర్ ప్రత్యేక చొరవ!

 – రూ.5.60 లక్షల విలువైన 26 సీసీ కెమెరాల ఏర్పాటు.. గ్రామమంతా నిఘా వలయంలోకి.

  – సీఐ మన్మధకుమార్‌ చేతుల మీదుగా ప్రారంభం

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో 

గ్రామంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచే ఉద్దేశంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్, ఎస్సై నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. గ్రామానికి చెందిన కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, సత్యనారాయణలు రూ.5.60 లక్షల విలువైన 26 సీసీ కెమెరాలను విరాళంగా అందించడం అభినందనీయమని సీఐ మన్మధకుమార్ పేర్కొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ప్రధాన కూడళ్లు, రహదారులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి కే. పద్మజ, వార్డు సభ్యులు సప్పిడి ప్రభాకర్‌రెడ్డి, మాధగోని పరమేశ్వరి-శంకర్, అంతటి సౌజన్య-ప్రవీణ్, మాజీ సర్పంచులు చీరిక సంజీవరెడ్డి, అంతటి రమేష్‌గౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking