రక్తదానం.. ప్రాణదానంతో సమానం
అత్యవసర వేళల్లో రక్తం అందించడమే లక్ష్యం
పెద్దకాపర్తి లో ఉచిత మెగా రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంప్ నిర్వహణ
చిట్యాల , అక్షిత ప్రతినిధి :
రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రక్త నిల్వలను పెంచి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో రామన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఉచితంగా వైద్య పరీక్షలు
యశోద హాస్పిటల్, మలక్‌పేట వారి సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌లో షుగర్, ర్యాండమ్ షుగర్, ఈసీజీ, 2D ఎకో, కంటి పరీక్షలు తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. డాక్టర్లు రవితేజ, రేవంత్, దుర్గశ్రీ, నిహారిక గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ డా. భాస్కర్ రావు పనకంటి, సెక్రటరీ లయన్ మహమ్మద్ ఉస్మాన్, ట్రెజరర్ లయన్ నరేందర్ రెడ్డి గంట్ల మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.
నేత్రదానంపై అవగాహన ర్యాలీ
ఐ డొనేషన్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీ ఆధ్వర్యంలో నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. “నేత్రదానం చేయండి.. మరొకరికి వెలుగునివ్వండి” అనే సందేశంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
లయన్స్ క్లబ్ సేవలను అభినందించిన ప్రతినిధులు
రామన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను రీజినల్ చైర్‌పర్సన్ లయన్ సంజీవరెడ్డి సిరిగిరెడ్డి, లయన్ యాదమ్మ, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ కృష్ణారెడ్డి యపాల, లయన్ మర్రి గోపాల్‌రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, కాకులరపు బొర్రారెడ్డి తదితరులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచులు కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, మర్రి జలందర్‌రెడ్డి, ఓర్సు సైదులు, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నర్సింహ, ఆనగంటి నరేష్, మర్రి హరీష్, ఏర్పుల వెంకటేష్, యాదయ్య, ఎదుళ్ల అజిత్‌రెడ్డి, కామినేని దుర్గకుమార్, నరేష్, లవకుమార్, రాకేష్, శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.