ఓటు చోరీ కీలక సూత్రదారి జ్ఞానేష్ కుమార్ దిగిపోవాలి
– డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
– రామన్నపేటలో డివైఎఫ్ఐ నిరసన కార్యక్రమం
– డివైఎఫ్ఐ నాయకులతోపోలీస్ వాగ్వాదం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
డివైఎఫ్ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని సంచలనంగా మారిన ఓట్ చోరీ అనే అంశం మీద దేశమే అట్టుడికి పోతున్న సందర్భంలో వివిధ రూపాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి జ్ఞానేష్ కుమార్ ఒంటెద్దు పోకడతోటి దేశంలోనే మూడున్నర కోట్ల ఓట్లను చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేసే విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్ఞానేష్ కుమార్ మాత్రమే దేశంలో గాని రాష్ట్రంలో గాని పొట్ట తిప్పల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసినటువంటి సామాన్య ప్రజలను తీవ్ర స్థాయిలో ఇబ్బందుల గురి చేసి జైలులో నిర్బంధిస్తున్న తరుణంలో మరి జ్ఞానేశ్వర్ బయట ఎందుకు ఉండాలో కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని అన్నారు ఓట్ చోరీ చేసి ప్రశాంతంగా రూములలో సేధా తీరుతున్న జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే బర్తరఫ్ చేసి జైల్లో పెట్టాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ యొక్క అండదండలతోటి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు అదేవిధంగా బెంగాల్ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లను తీసేసి నకిలి ప్రభుత్వం ఏర్పాటు అయింది అని కూడా అన్నారు నకిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా సహకరించిన జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే భర్తరఫ్ చేసే వరకు మా పోరాటాలు ఉదృతంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని జ్ఞానేశ్ కుమార్ ను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రామన్నపేట మండల అధ్యక్ష కార్యదర్శులు మెట్టు శ్రవణ్ కుమార్ శానకొండ రామచంద్రం మండల కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, నాగటి రవి, జేల్లాల మల్లేశం, ఆవనగంటి మహేష్, గట్టు మహేష్,మచ్చ నరేష్, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.