రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించిన న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో రామన్నపేట కోర్టు పరిధిలోని న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్యూటీ సీఎంను కలిసి తమ వినతిని అందజేశారు. రామన్నపేట ప్రాంతంలో న్యాయపరమైన కేసులు, ప్రజల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయపరమైన వ్యవహారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజలు సమయం, ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి, ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందేలా ప్రభుత్వం సహకరించాలని డిప్యూటీ సీఎంను కోరారు. కోర్టు ఏర్పాటు కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్‌మోహన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నందాల బిక్షం, సీనియర్ నాయకులు పూన బాలకృష్ణ, గుత్త నర్సింహారెడ్డి, పిట్ట వెంకట్‌రెడ్డి, రామిని రమేష్, శంబాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.