ఆడంబరాలకు దూరం.. ఆత్మీయతకు దగ్గర

ఆడంబరాలకు దూరం.. ఆత్మీయతకు దగ్గర

– రాయపర్తి టీ కొట్టులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందడి

– రాయపర్తి అక్షిత ప్రతినిధి

నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా నేతగా గుర్తింపు తెచ్చుకున్న పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి బుధవారం రాయపర్తి మండల కేంద్రంలో సందడి చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆమె మార్గమధ్యలో రాయపర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యకర్త కృష్ణకు చెందిన టీ షాప్ వద్ద తన వాహనాన్ని ఆపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ సరదాగా ముచ్చటించారు.క్షేత్రస్థాయి పరిణామాలపై వారితో సుదీర్ఘంగా మాట్లాడారు.నాయకులు, కార్యకర్తల వ్యక్తిగత క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వివిధ రకాల సమస్యల గురించి అడిగారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని సూచించారు ఏ విధమైన ప్రోటోకాల్ ఆడంబరాలు లేకుండా, ఒక సామాన్య కార్యకర్త నడుపుతున్న టీ షాప్‌లో అందరితో కలిసి కూర్చుని, టీ తాగుతూ సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడ కొద్దిసేపు ఎంతో ఆత్మీయ వాతావరణాన్ని కల్పించారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇలా నేరుగా తమ వద్దకు వచ్చి ముచ్చటించడం, అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాయపర్తి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking