బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి అక్షిత ప్రతినిధి

మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరామర్శించారు. మహబూబ్‌నగర్ గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెండ్లి మల్లారెడ్డి తల్లి పెండ్లి వెంకట్ నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు నూనె కొమురయ్య పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అదేవిధంగా అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ఇజ్జగిరి సమ్మయ్య, దూరిశెట్టి కొమురయ్యలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంధన్‌పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఇటిక్యాల ప్రతికు, డెక్క మారెమ్మ, సూరినేని శోభరణి, డెక్క బచ్చమ్మ కుటుంబాలను పరామర్శించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking