వార్డుమెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహిద్ అంజాద్ ఎన్నిక……
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండల వార్డుమెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహిద్ అంజాద్ ఎన్నికయ్యారు శుక్రవారం మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి శైలజ, జిల్లా ఇన్‌చార్జి ఎడుమేకల మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో రామన్నపేట మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మొహమ్మద్ అబ్దుల్ వహిద్ అంజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాధారపు మహేష్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము రామస్వామి, ఉపాధ్యక్షుడిగా సింగణబోయిన బాలరాజులను , అలాగే నకిరేకల్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిగా చిన్నపాక రమేష్, బాషమల్ల అనిత సంతోష్‌లను ఎన్నుకున్నారు.