గంగాధర మండలంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకల సంబరాలు
గంగాధర అక్షిత న్యూస్
గంగాధర మండలంలో పలు ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో మరియు అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని గంగాధర _1 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ తాళ్ళ అరుణకుమారి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిపారు.తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో టీచర్ అరుణకుమారితోపాటు ఆయా శ్వేత, పిల్లలు,తల్లులు మరియు మహిళలు పాల్గొన్నారు.