అలుగునూర్ 2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అలుగునూర్ 2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కరీంనగర్ అక్షిత బ్యూరో

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధిలోని అలుగునూర్ 2 అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, ఉపాధ్యాయులు, స్థానిక మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను కేంద్రం మధ్యలో ఏర్పాటు చేశారు. మహిళలుచిన్నారులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లతో సందడి చేశారు. పండుగ వాతావరణం అంగన్వాడీ కేంద్రంలో నెలకొంది.చిన్ననాటి నుంచే పిల్లలకు మన రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేలా ఈ వేడుకలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లత ఆయాలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking