టిఆర్ఎస్ నేత సోహన్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ పై విమర్శలు సరికాదు

టిఆర్ఎస్ నేత సోహన్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ పై విమర్శలు సరికాదు

– బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ 

కరీంనగర్ అక్షిత బ్యూరో

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ నేత సోహాన్‌సింగ్ చేసిన విమర్శలు, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం డి ముజీబ్ తెలిపారు. బతుకమ్మ, విజయదశమి ఏర్పాట్లు, తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు, వీధి దీపాల సమస్యలపై సోహన్ సింగ్ మున్సిపల్ యంత్రాంగాన్ని విమర్శించడం సరికాదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరిన తర్వాత , కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాయ సహకారాలతో , మేయర్ కోలగాని శ్రీనివాస్ సారధ్యంలో నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం గా కొనసాగుతున్నాయని తెలిపారు. నగర ప్రజలకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అభివృద్ధి పనులు జరుగుతున్న , రాజకీయ ఉనికి కోసం సోహన్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా రాబోయే పండుగ ఏర్పాట్లలో మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు., బతుకమ్మ ,దసరా పండుగల కోసం మున్సిపల్ దాదాపు మూడు కోట్లు వెచ్చించి, నగరానికి పండుగ శోభ తెచ్చే పనులు కొనసాగుతున్నాయని, ఆ విధంగా మున్సిపల్ యంత్రాంగం కూడా పకడ్బందీ చర్యలు తీసుకుందన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదని , సోహన్ సింగ్ ఇకనైనా తన పద్ధతి మార్చుకొని, విమర్శలకు బదులు గా నగరాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ముజీబ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking