ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ బ్లాక్‌డే!
– లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
– ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతకు డిమాండ్.. కేంద్ర వైఖరిపై నాయకుల ఆగ్రహం...
లోకేశ్వరం,అక్టోబర్ 9 అక్షిత న్యూస్ :
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బ్లాక్‌డే నిరసన నిర్వహించారు.ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్,డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సూచనలతో పాటు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్, పిలుపుతో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతును వినిపించేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతోపాటు ఇండియా కూటమి ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం, ప్రజల హక్కులను కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా సంబంధిత వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు నర్సన్న, ముధోల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకుడు నరేష్, సేవాదళ్ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు. సర్పంచులు రాజు, బచ్చన్న, నర్సింగ్‌రావు, స్వామి, నాయకులు మురళీధర్, నగేష్ గౌడ్, లచ్చారెడ్డి, వెంకటేశ్‌రావు, ఎల్లన్న, ఉమేష్ తదితరులు హాజరయ్యారు…