కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శిగా జాల మల్లేష్ యాదవ్

కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శిగా జాల మల్లేష్ యాదవ్

చౌటుప్పల్/ అక్షిత న్యూస్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆరెగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాల మల్లేష్ యాదవ్ నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆయన నియామకాన్ని ఖరారు చేశారు. చౌటుప్పల్ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ రాజకీయాల్లో అనుభవం సంపాదించిన జాల మల్లేష్ యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అహర్నిశలు శ్రమించారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేలా ప్రధాన కార్యదర్శి పదవికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు మేరకు డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆయనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా జాల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking