తెలంగాణ జర్నలిస్టుల జేఏసి జిల్లా సహాయ కార్యదర్శి గా సిర మహేష్
– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్
రామన్నపేట, అక్షిత ప్రతినిధి:
తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెజెఏసి)యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా రామన్నపేట కేంద్రానికి చెందిన అక్షిత న్యూస్ కరస్పాండెంట్ సిర మహేష్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతనంగా నియమితులైన సిర మహేష్ తక్షణమే బాధ్యతలు చేపట్టి జేఏసీ నియమ నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో పని చేయాలని సంస్థ చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆశయాలకు అనుగుణంగా యూనియన్లు, ప్రెస్ క్లబ్ లు, అసోసియేష్ లు అన్ని వర్గాల జర్నలిస్టు మిత్రులను కలుపుకొని నిరంతరాయంగా కృషి చేస్తూ జేఏసీ ఆశయాలు నెరవేరేవరకు నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు తెలిపారు.