తెలంగాణలో టెట్ ధరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించాలి
-తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామరావు డిమాండ్
ఖమ్మం/అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును తక్షణమే తగ్గించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.నిన్న ఖమ్మం మీడీయాతో మాట్లాడుతూ గతంలో టెట్ ధరఖాస్తు ఫీజు ఒక పేపర్ కు 300 రూపాయలు రెండు పేపర్లకు 400 రూపాయల ఫీజు ఉండేదనీ దీనీతో పాటు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఫీజులో రాయితీ ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనాలో టెట్ నోటిఫికేషన్ లో ఒక పేపర్ కు 1000 రూపాయలు రెండు పేపర్లకు 2000 రూపాయలుగా వసూల్ చేయటం ధారణమన్నారు.టెట్ దరఖాస్తు ఫీజును దాదాపుగా ఐదు రెట్లు పెంచడం వలన టెట్ రాసే నిరుధ్యోగ అభ్యర్థుల పై పెనుభారం పడుతుందని అన్నారు. ఈ నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసి వికలాంగులకు ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని టెట్ అనేది సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే అర్హత పరిక్ష,కాబట్టి అర్హత సాధించని అభ్యర్థులతో పాటు అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఎక్కువ మార్కులు పొందడం కోసం మరలా రాస్తుంటారని ప్రభుత్వం వెంటనే స్పందించి టెట్ పరీక్ష దరఖాస్తు ఫీజు ను తక్షణమే తగ్గించి నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విదంగా దరఖాస్తు ఫీజు ని నిర్ణయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా నాయకులు చౌహాన్ చౌదరి రమేష్ సుధాకర్ కిషోర్ జబ్బర్ రమణ సరిత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.